
టెస్టుల్లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఒకే క్యాలెండర్ ఈయర్‌లో రెండు సెంచరీలు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా జడేజా రికార్డులకెక్కాడు. ఎడ్జ్‌బస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో సెంచరీ సాధించిన జడేజా.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 104 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్(146), జడేజా(104) పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు, పొట్స్ 2 వికెట్లు,బ్రాడ్,రూట్,స్టోక్స్ తలా వికెట్ సాధించారు.
ఈ అరుదైన ఘనత సాధించిన భారత ఆటగాళ్లు వీరే
కపిల్ దేవ్-1986
ఎంస్ ధోని-2009
హర్భజన్ సింగ్-2010
రవీంద్ర జడేజా-2022
చదవండి: BAN vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. తీవ్ర అస్వస్థతకు గురైన బంగ్లా ఆటగాళ్లు..!