శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ సెంచరీతో మెరిశాడు. టాపార్డర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చేయలేని సెంచరీని జడేజా సాధించాడు. 160 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో జడేజా టెస్టుల్లో రెండో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. లంబుల్డేనియా బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 111వ ఓవర్ తొలి బంతిని జడేజా కవర్ దిశగా ఆడి సింగిల్ తీశాడు.
అంతే జడేజా తన స్టైల్ కత్తిసాము సెలబ్రేషన్‌తో మెరిశాడు. జడేజా ఎప్పుడు అర్థసెంచరీ లేదా సెంచరీ చేసిన ప్రతీసారి తన బ్యాట్‌నే కత్తిలా తిప్పడం చేస్తుంటాడు. ఈ సెలబ్రేషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా గాయం తర్వాత తిరిగొచ్చిన జడేజాకు రీఎంట్రీలో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అందుకే సెంచరీ బాదగానే బ్యాట్‌ను కత్తిలా తిప్పిన జడేజా.. ఆ తర్వాత ఒక చేతిలో హెల్మెట్.. ఇంకో చేతిలో బ్యాట్‌ను పట్టుకొని చిరునవ్వుతో డ్రెస్సింగ్ రూప్ వైపు చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సెంచరీ చేసి జడేజా అలా బ్యాట్ తిప్పగానే అభిమానులు కామెంట్స్ చేశారు. అరె జడేజా మళ్లీ ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సూపర్ సెంచరీతో మెరిశావు.. బ్యాట్‌ను తిప్పావు.... జడ్డూ భయ్యా.. నీ స్లైలే వేరెప్పా అంటూ పేర్కొన్నారు.
ఇక సెంచరీ తర్వాత తన ఆటలో జోరు పెంచిన జడేజా 150 పరుగుల మార్క్‌ను 51 బంతుల్లోనే సాధించి డబుల్ సెంచరీ వైపు పరిగెడుతున్నాడు. అంతకముందు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.
'Rockstar' @imjadeja 👏👏@Paytm #INDvSL pic.twitter.com/JG25othE56
— BCCI (@BCCI) March 5, 2022
Comments
Please login to add a commentAdd a comment