RCB Shares Video Of Hyderabadi Biryani Time With Virat Kohli And RCB Team At Siraj New House - Sakshi
Sakshi News home page

#RCB: 'హైదరాబాద్‌ బిర్యానీ మస్తుంది.. SRH పని పడతం'

Published Wed, May 17 2023 5:31 PM | Last Updated on Wed, May 17 2023 6:53 PM

RCB Shares Video Hyderabadi Biryani Time-Kohli-Others At-Siraj New House - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే గుజరాత్‌ ప్లేఆఫ్‌కు చేరుకోగా..  మిగతా మూడు స్థానాల కోసం ఏడు జట్ల మధ్య పోటీ నెలకొంది. అందులో ఆర్‌సీబీ కూడా ఉంది. మే 18న హైదరాబాద్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇప్పటికే ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించగా.. ఆర్‌సీబీకి మాత్రం చాన్స్‌ ఉంది. కోహ్లి, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ ఆటను చూడడానికి హైదరాబాద్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఆర్‌సీబీ హైదరాబాద్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సిరాజ్‌ జుబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో కొత్త ఇంటిని నిర్మించాడు.  ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ ఆడేందుకు వచ్చిన ఆర్‌సీబీ జట్టును సిరాజ్‌ తన ఇంటికి ఆహ్వానించాడు. సోమవారం ఆర్‌సీబీ ప్లేయర్లు సిరాజ్‌ కొత్త ఇంట్లో సందడి చేశారు.

కుటుంబంతో ఆనందంగా గడిపిన ఆర్‌సీబీ ఆటగాళ్లకు సిరాజ్‌ ఫేమస్‌హైదరాబాద్‌ బిర్యానీ తినిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆర్‌సీబీ యాజమాన్యం ఈ వీడియోనూ షేర్‌ చేస్తూ ''హైదరాబాద్‌ బిర్యానీ మస్తుంది.. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ పని పడతాం'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లే ఆప్స్‌కు అర్హత సాధించే ఛాన్స్‌ ఉంది.

చదవండి: ప్రతీసారి మనది కాదు సూర్య.. జాగ్రత్తగా ఆడాల్సింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement