టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. కేవలం 268 పరుగులు మాత్రమే సాధించాడు. అంతేకాకుండా తన ఐపీఎల్ కెరీర్‌లో ఒక్క అర్ధసెంచరీ కూడా సాధించకుండా సీజన్‌ను రోహిత్ ముగించడం ఇదే తొలిసారి. ఇది ఇలా ఉండగా.. స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.
అంతేకాకుండా భారత జట్టు ఐర్లాండ్ పర్యటన కు వెళ్లి అట్నుంచి అటే ఇంగ్లండ్ కు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సిరీస్, ఐర్లాండ్ సిరీస్, ఇంగ్లండ్ టూర్‌కు జట్లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం(మే22) వర్చువల్‌గా సమావేశం కానుంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సిరీస్ కు తనకు విశ్రాంతినివ్వాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐకి కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
"రోహిత్ తనకు కొన్నాళ్లపాటు తనకు విశ్రాంతి కావాలని కోరాడు. రోహిత్ నిర్ణయాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం. అతడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున అన్ని మ్యాచ్‌లు ఆడాడు. కాబట్టి అతడి విన్నపాన్ని మేము అర్థం చేసుకుంటాం. ఇంగ్లండ్ టూర్‌కు అతడు సిద్దంగా ఉంటాడాని కోరుకుంటున్నాం" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.
చదవండి: IPL 2022: 'నటరాజన్ గాయం నుంచి కోలుకున్నాక తన ఫామ్‌ను కోల్పోయాడు'
Comments
Please login to add a commentAdd a comment