ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న రెండో టెస్టు తొలి రోజు భారత్ అధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 263 పరుగులకు భారత బౌలర్లు కట్టడి చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు సాధించారు. కాగా ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా(81), హ్యాండ్స్ కాంబ్(72 నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(13), కేఎల్ రాహుల్(4) పరుగులతో ఉన్నారు. ఇక మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ప్రశాంతతను కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ తీసుకున్న ఓ నిర్ణయంపై రోహిత్ తీవ్ర ఆంసతృప్తి వ్యక్తం చేశాడు.
ఏం జరిగిందంటే
తొలి రోజులో ఆట ఆఖరి ఓవర్ వేసిన నాథన్ లియాన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఢిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ప్యాడ్‌కు తాకి ఫార్వర్డ్ షార్ట్ లెగ్ ఫీల్డర్ చేతికి వెళ్లింది. వెంటనే బౌలర్‌తో పాటు ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్‌కు అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ ఔటిచ్చాడు. వెంటనే అసహనానికి గురైన రోహిత్.. అంపైర్‌పై అరుస్తూ రివ్యూ తీసుకున్నాడు.
రివ్యూ తీసుకునే క్రమంలో బ్యాట్‌ను గట్టిగా బాదుతూ రోహిత్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే రివ్యూలో బంతి స్పష్టంగా ప్యాడ్‌కు తాకినట్లు కన్పించడంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: South Africa cricket: దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా బవుమా.. టీ20లకు గుడ్‌బై!
— Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) February 17, 2023
Comments
Please login to add a commentAdd a comment