వన్డే ప్రపంచకప్-2023లో వరస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ జోరుకు టీమిండియా బ్రేక్‌లు వేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ధర్మశాల వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
భారత విజయంలో మహ్మద్ షమీ, విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించారు. తొలుత బౌలింగ్‌లో షమీ 5 వికెట్లతో అద్బుత ప్రదర్శన కనబరచగా.. అనంతరం ఛేజింగ్‌లో విరాట్ కోహ్లి(95) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
విరాట్ తృటిలో తన 49వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 274 పరుగుల లక్ష్యాన్ని 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు సాధించగా.. కుల్దీప్ రెండు, బుమ్రా, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇక విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచిన మహ్మద్ షమీ, విరాట్ కోహ్లిపై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ మెగా టోర్నమెంట్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మా పని సగం అయిపోయింది. ఇదే రిథమ్‌ను టోర్నీ మొత్తం కొనసాగించడం చాలా ముఖ్యం.
మేము తర్వాతి మ్యాచ్‌ల్లో ఏమి జరుగుతుందన్న విషయం గురించి ఆలోచించడం లేదు. ఇప్పటి నుంచి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతీ మ్యాచ్‌లో 100 శాతం ఎఫెక్ట్ పెట్టడమే మా లక్ష్యం. ఇక షమీ ఈ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఇటువంటి వికెట్‌పై అతడికి ఎంతో అనుభవం ఉంది. అతడొక క్లాస్ బౌలర్. ఒక దశలో కివీస్ 300 పరుగులు చేస్తుందని మేము భావించాము.
కానీ బ్యాక్ ఎండ్‌లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక నా బ్యాటింగ్‌ను నేను ఆస్వాదిస్తున్నాను. గిల్ ది నాది వేర్వేరు మైండ్ సెట్‌లు అయినప్పటికీ.. ఒకరినొకరు అర్ధం చేసుకుని మంచి ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇక కోహ్లి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు చాలా సంవత్సరాల నుంచి జట్టుకు ఇదే పనిచేస్తున్నాడు.
ఎన్నో అద్భుతవిజయాలను అందించాడు. మిడిల్ ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయినపుడు కోహ్లి, జడేజా మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక మా ఫీల్డింగ్‌లో మేము చిన్న చిన్న తప్పుల చేశాం. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో రవీంద్ర జడేజా ఒకరు. కానీ కొన్ని సార్లు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. అవి సహజంమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.
చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment