హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. మొదటి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 230 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ స్పిన్నర్లలో టామ్ హార్ట్‌లీ 7 వికెట్లతో చెలరేగాడు.
టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫలమ్యమేనని రోహిత్ అంగీకరించాడు.
"తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం లభించడంతో మేము గెలుస్తామన్న నమ్మకం ఉండేది. కానీ ఓలీ పోప్ మాత్రం అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. భారత పరిస్థితుల్లో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ పోప్‌దే. అతడి ఆట తీరుకోసం ఎంతచెప్పుకున్న తక్కువే. అయితే 230 పరుగులేమి పెద్ద లక్ష్యమేమి కాదు.
అదే విధంగా పిచ్ కూడా బ్యాటింగ్‌కు మంచిగా అనుకూలించిది. కానీ మేము బ్యాటింగ్‌లో విఫలమకావడంతో టార్గెట్‌ను ఛేజ్ చేయలేకపోయాం. మా బౌలర్లు కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయడంలో విజయవంతమయ్యారు. కానీ పోప్ మాత్రం తన విరోచిత పోరాటంతో అడ్డుగా నిలిచాడు.
ఏదైమనప్పటికీ మేము ఒక టీమ్‌గా విఫలమయ్యాం. నేను మ్యాచ్‌ను ఐదో రోజు వరకు తీసుకువెళ్లాలని అనుకున్నాను. కానీ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది. అయితే మా లోయర్డ్ ఆర్డర్ బ్యాటర్లు మాత్రం ఆఖరివరకు పోరాడారని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment