వీకెండ్ మ్యాచ్‌లు ‘ఎండ్’దాకా వచ్చి అమాంతం ఉత్కంఠ రేపుతున్నాయి. బెంగళూరు, రాజస్తాన్‌లు కూడా ఆఖరిదాకా పోరాడాయి. కానీ హర్షల్ పటేల్ తొలి మూడుబంతులు రాయల్ చాలెంజర్స్ శిబిరాన్ని డీలా పరిస్తే... తర్వాతి మూడు బంతులు విజయానికి ఊపిరి పోశాయి.
బెంగళూరు: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి జట్టు గర్జిస్తోంది. బ్యాటింగ్‌లో మెరుపులకు బౌలింగ్‌లో నిప్పులు చెరిగే బంతులు జతవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 7 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. గత మ్యాచ్ ఫార్ములాతోనే రెగ్యులర్ కెపె్టన్ డుప్లెసిస్ (39 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ‘ఇంపాక్ట్’ చూపాడు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన శైలి ధాటి కొనసాగించాడు. బౌల్ట్, సందీప్ శర్మ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత గెలుపు తీరందాకా వచ్చి న రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులే చేసి ఓడింది. డుప్లెసిస్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చి న బౌలర్ హర్షల్ పటేల్ (3/32) బెంగళూరు జట్టుకు ఉపయోగపడ్డాడు.
ఇద్దరి తీరు దంచికొట్టుడే!
ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ను నడిపించింది... మెరిపించింది... మురిపించింది ఇద్దరే! ఓపెనర్ డుప్లెసిస్, మిడిలార్డర్‌లో మ్యాక్స్‌వెల్ కలిసి మెలిసి దంచేశారు. జట్టు ఖాతా తెరువకముందే కెప్టెన్‌గా కోహ్లి (0) డకౌటైతే... డుప్లెసిస్ ‘ఇంపాక్ట్’కు మ్యాక్సీ డబుల్ డోసు ఇచ్చాడు. వన్‌డౌన్‌లో దిగిన షహబాజ్ (2) కూడా నిరాపరిచిన బెంగళూరు ఇన్నింగ్స్ 12 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది.
కానీ ఆ తర్వాత 11 ఓవర్ల పైచిలుకు వరకు కూడా వారిద్దరి ప్రతాపమే స్కోరును హోరెత్తించింది. మ్యాక్సీ 27 బంతుల్లో ఫిఫ్టీ కొడితే, డుప్లెసిస్ 31 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 127 పరుగులు జతచేశారు. ఆ తర్వాత వచ్చి నవారెవరూ పెద్దగా ఆడలేదు. కాసేపైన నిలువలేదు.
పడిక్కల్ రాణించినా... అశ్విన్ వణికించినా...
భారీలక్ష్యం ముందుంటే ‘హిట్టర్’ బట్లర్ (0) సిరాజ్ బౌలింగ్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. యశస్వి, ఇంపాక్ట్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ లక్ష్యానికి తగ్గ జోరుతో స్కోరును పెంచారు. పడిక్కల్ 30 బంతుల్లో అర్ధ సెంచరీ చేసుకున్నాక... జట్టు స్కోరు వందకు ముందు అతను, వంద పరుగుల తర్వాత యశస్వి అవుటయ్యారు.
అయితే సంజూ సామ్సన్ (15 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్), ధ్రువ్ జురెల్ (16 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన ఆటతో పోటీ ఆఖరిదాకా వచ్చి ంది. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. అశ్విన్ (12) తొలి మూడు బంతుల్లో 4, 2, 4తో 10 పరుగులతో వణికించాడు. అయితే తర్వాతి మూడు బంతుల్లో హర్షల్... అశ్విన్ వికెట్, 1, 1తో ముగించడంతో ఆర్‌సీబీ ఊపిరి పీల్చుకుంది.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) బౌల్ట్ 0; డుప్లెసిస్ (రనౌట్) 62; షహబాజ్ (సి) యశస్వి (బి) బౌల్ట్ 2; మ్యాక్స్‌వెల్ (సి) హోల్డర్ (బి) అశ్విన్ 77; మహిపాల్ (సి) పడిక్కల్ (బి) చహల్ 8; దినేశ్ కార్తీక్ (సి) బట్లర్ (బి) సందీప్ శర్మ 16; సుయశ్ ప్రభుదేశాయ్ (రనౌట్) 0; హసరంగ (రనౌట్) 6; విల్లీ (నాటౌట్) 4; వైశాక్ (సి) హెట్‌మైర్ (బి) సందీప్ శర్మ 0; సిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–0, 2–12, 3–139, 4–156, 5–163, 6–163, 7–180, 8–184, 9–184. బౌలింగ్: బౌల్ట్ 4–0–41–2, సందీప్ శర్మ 4–0–49–2, అశ్విన్ 4–0–36–1, చహల్ 4–0–28–1, హోల్డర్ 4–0–32–0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) కోహ్లి (బి) హర్షల్ పటేల్ 47; జోస్ బట్లర్ (బి) సిరాజ్ 0; దేవ్‌దత్ పడిక్కల్ (సి) కోహ్లి (బి) విల్లీ 52; సంజూ సామ్సన్ (సి) షహబాజ్ (బి) హర్షల్ పటేల్ 22; హెట్‌మైర్ (రనౌట్) 3; ధ్రువ్ జురెల్ (నాటౌట్) 34; అశ్విన్ (సి) ప్రభుదేశాయ్ (బి) హర్షల్ పటేల్ 12; అబ్దుల్ బాసిత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–1, 2–99, 3–108, 4–125, 5–155, 6–180. బౌలింగ్: సిరాజ్ 4–0–39–1, విల్లీ 4–0–26–1, వైశాక్ 2–0–24–0, మ్యాక్స్‌వెల్ 2–0–25–0, హర్షల్ పటేల్ 4–0–32–3, హసరంగ 4–0–32–0.
Comments
Please login to add a commentAdd a comment