సంజూ భారీ సిక్స‌ర్‌.. లేడీ ఫ్యాన్ చెంపకు త‌గిలిన బంతి! వీడియో | Sanju Samson's Brutal Six Hits A Girl On Face | Sakshi
Sakshi News home page

IND vs SA: సంజూ భారీ సిక్స‌ర్‌.. లేడీ ఫ్యాన్ చెంపకు త‌గిలిన బంతి! వీడియో

Published Sat, Nov 16 2024 11:25 AM | Last Updated on Sat, Nov 16 2024 11:34 AM

Sanju Samson's Brutal Six Hits A Girl On Face

సౌతాఫ్రికాతో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో డ‌కౌటైన టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ ఆఖ‌రి టీ20లో మాత్రం దెబ్బతిన్న సింహంలా విజృంభించాడు. జోహన్స్‌బర్గ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.

సఫారీ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్‌​.. 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. శాంసన్ కొట్టని ఓ భారీ సిక్సర్ నేరుగా వెళ్లి స్టాండ్స్‌లో ఉన్న ఓ మ‌హిళా అభిమాని ముఖానికి త‌గిలింది. 

ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన స్టబ్స్ రెండో బంతిని మిడిల్ అండ్ లెగ్‌లో ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని శాంసన్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో ఆ బంతి మొదట సెక్యూరిటీ గార్డును తాకి,  ఆపై స్టాండ్స్‌లో ఉన్న అమ్మాయి దవడకు తగిలింది.

దీంతో ఆ లేడీ ఫ్యాన్ నొప్పిని భరించలేక ఏడ్చేసింది. ఆమెకు వెంటనే ఐస్ తెచ్చి దవడపై ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆమె గాయపడినట్లు తెలియగానే సంజూ క్ష‌మాప‌ణ‌లు కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రోటీస్‌ను 135 పరుగుల తేడాతో భారత్‌ చిత్తు చేసింది.
చదవండి: IND vs SA: చ‌రిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. ప్రపంచంలో ఒకే ఒక్కడు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement