బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. రెండో రోజు ఆట ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్(86) ఔటయ్యాడు. ఎబాడోట్ హోస్సేన్ అద్భుతమైన బంతితో అయ్యర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
అయితే మ్యాచ్ తొలిరోజే శ్రేయస్ అయ్యర్ పెవిలియన్‌కు చేరాల్సింది. అదృష్టవశాత్తూ ఎబాడోట్ వేసిన బంతి స్టంప్స్ తాకినప్పటికీ బెయిల్స్ కిందపడకపోవడంతో అయ్యర్ బతికిపోయాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను కూడా బంగ్లా ఫీల్డర్లు జారవిడిచారు.
అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవడంలో అయ్యర్ విఫలమయ్యాడు. అంతకుముందు భారత వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా కూడా తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 90 పరుగులు వద్ద పుజారా క్లీన్ బౌల్డయ్యాడు. ఇక రెండో రోజు లంచ్ విరామానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్(40), కుల్దీప్ యాదవ్(21) ఉన్నారు.
చదవండి: సానియా- షోయబ్ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment