ఐపీఎల్-2023లో భారత యువ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన సంచలన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫియర్-1లో అద్భుతమైన సెంచరీతో గిల్ చెలరేగాడు. గుజరాత్ వరుసగా రెండో సారి ఫైనల్ చేరడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది సీజన్‌లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కావడం గమానర్హం.
ఈ మ్యాచ్‌లో 60 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 సిక్స్‌లు, 7 ఫోర్లతో 129 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన ఈ పంజాబీ.. 851 పరుగులు చేశాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గిల్‌పై దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబి డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఈ స్థాయికి చేరుకుంటాడని తన తండ్రి 3 ఏళ్ల క్రితమే ఊహించాడని డివిలియర్స్ తెలిపాడు. తన తండ్రికి శుభ్‌మన్ గిల్ అంటే ఎంతో ఇష్టం అని ఏబీడీ అన్నాడు.
"గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు చాలా ఈజీగా భారీ సిక్స్‌లు కొట్టాడు. అది ఒక్క గిల్‌కే సాధ్యం అవుతుంది. అతడు ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక బౌలర్లకు చుక్కలు చూపించాడు. శుబ్‌మన్ గిల్ మా నాన్న ఫేవరేట్ ప్లేయర్. ఈ విషయాన్ని సీజన్ ఆరంభంలోనే నేను చెప్పాను. అదే విధంగా గిల్‌ఒక అద్భుతమైన ఆటగాడు అవుతాడని మా నాన్న 3 ఏళ్ల క్రితమే ఊహించారు.
గిల్ భారత క్రికెట్ దొరికిన అణిముత్యం. అతడికి టీమిండియా తరపున మూడు ఫార్మాట్‌లలో ఆడే సత్తా ఉంది. భవిష్యత్తులో మరింత రాణిస్తాడు. అయితే ఆర్సీబీపై అతడి ఆడిన ఇన్నింగ్స్‌కు నేను ఫిదా అయిపోయాను. కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించి తన జట్టును అద్భుమైన విజయాన్ని అందించాడని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన గుజరాత్ టైటాన్స్.. 16 ఏళ్లలో ఇదే తొలిసారి!
Comments
Please login to add a commentAdd a comment