క్రిస్ట్‌చర్చ్: పాకిస్తాన్‌కు చెందిన ఆరుగురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా అక్కడకు వెళ్లిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కరోనా టెస్టులు చేయగా అందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. తద్వారా వారిని ఐసోలేషన్‌కు తరలించారు. తొలుత నిర్వహించిన టెస్టుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలగా, అటు తర్వాత మరో నలుగురికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు(ఎన్‌జడ్‌సీ) తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. (షమీ భార్య జహాన్‌కు వేధింపులు)
ఫలితంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ఆలస్యం కానుంది. ఈనెల 24వ తేదీన న్యూజిలాండ్ గడ్డపై పాక్ అడుగుపెట్టింది. న్యూజిలాండ్‌తో డిసెంబర్10వ తేదీ నుంచి పాకిస్తాన్ సిరీస్ ఆరంభం కానుంది. వచ్చే నెల10వ తేదీ నుంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆరంభం కానుండగా, డిసెంబర్ 18వ తేదీన తొలి టీ20 జరుగనుంది. అనంతరం డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకూ రెండు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. రేపట్నుంచి న్యూజిలాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడు ట్వంటీ20 సిరీస్ జరుగనుంది. అనంతరం రెండు టెస్టుల సిరీస్ ఆడనున్నారు. (ఐసీసీ అవార్డుల నామినేషన్‌లో కోహ్లి డామినేషన్)
Comments
Please login to add a commentAdd a comment