భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించింది. భారత సెలెక్టర్లు టీమిండియాను ప్రకటించిన నిమిషాల వ్యవధిలో సౌతాఫ్రికా సెలెక్టర్లు తమ స్క్వాడ్‌ను ప్రకటించారు. ఈ జట్టులో ఎలాంటి సంచలన ఎంపికలు జరగలేదు. విధ్వంసకర బ్యాటర్లు, టాప్ క్లాస్ పేసర్లు, మ్యాజిక్ చేయగల స్పిన్నర్లతో సౌతాఫ్రికా టీం సమతూకంగా ఉంది.
రైట్ ఆర్మ్ పేసర్ గెరాల్డ్ కొయెట్జీ.. తన అదిరిపోయే ప్రదర్శనతో వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ ఒక్క ఎంపిక మినహాయించి, అంతా ఊహించనట్టుగానే జరిగింది. టెంబా బవుమా సఫారీలను ముందుండి నడిపించనుండగా.. బ్యాటింగ్ చిచ్చరపిడుగులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
అలాగే అరివీర భయంకర పేసర్లు కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్ కొయెట్జీ జట్టులో ఉన్నారు. వీరితో పాటు ఆల్‌రౌండర్ మార్కో జన్సెన్.. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్ సౌతాఫ్రికన్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు. కాగా, అక్టోబర్ 7న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో సౌతాఫ్రికా వరల్డ్‌కప్ జర్నీని ప్రారంభంకానుంది. అంతకుముందు వీరు సెప్టెంబర్ 27న ఆఫ్ఘనిస్తాన్‌తో, అక్టోబర్ 2న న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడతారు.
వన్డే వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్ కొయెట్జీ, మార్కో జన్సెన్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్
Comments
Please login to add a commentAdd a comment