చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా | South Africa Becomes First Team To Win Ten Consecutive Test Series Against A Particular Opponent | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా

Published Sun, Aug 18 2024 6:26 PM | Last Updated on Sun, Aug 18 2024 6:57 PM

South Africa Becomes First Team To Win Ten Consecutive Test Series Against A Particular Opponent

వెస్టిండీస్‌పై తాజాగా టెస్ట్‌ సిరీస్‌ విజయం సాధించిన సౌతాఫ్రికా సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్‌ క్రికెట్‌లో ఓ ప్రత్యర్ధిపై వరుసగా పది సిరీస్‌ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. సౌతాఫ్రికా 1998/99 నుంచి వెస్టిండీస్‌పై వరుసగా 10 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. 1998/99లో 5-0 తేడాతో, 2001లో 2-1 తేడాతో, 2003-04లో 3-0తో, 2005లో 2-0తో, 2007-08లో 2-1తో, 2010లో 2-0తో, 2014-15లో 2-0తో, 2021లో 2-0తో, 2023లో 2-0తో తాజాగా 1-0 తేడాతో వెస్టిండీస్‌ను వరుస సిరీస్‌ల్లో ఓడించింది.

కాగా, గయానా వేదికగా విండీస్‌తో తాజా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకు ఆలౌట్‌ కాగా.. వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు కుప్పకూలింది. అనంతరం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేయగా.. విండీస్‌ 222 పరుగులకే చాపచుట్టేసి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement