‘అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’ | Spain Star Rodri Recreates 2015 Distracted Boy Friend Meme While On Ibiza Vacation With Girlfriend, Photos Went Viral | Sakshi
Sakshi News home page

‘అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’

Aug 10 2026 8:58 AM | Updated on Aug 10 2026 10:05 AM

Spain Star Rodri-Recreates-2015-Distracted Boy Friend-Photo-Goes-Viral

Photo Credit: Twitter

స్పెయిన్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు రోడ్రి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రోడ్రి ప్రస్తుతం జీవిత భాగస్వామి, లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్‌ లారా ఇగ్లేసియాన్‌తో కలిసి ఇబిజాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇబిజాలో టూరిస్ట్ స్పాట్‌కు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న రోడ్రి, అటు పక్కనుంచి ఒక యువతి బికినీ వేసుకొని ఎదురుగా నడుస్తూ వచ్చింది. 


Photo Credit: Twitter

దీంతో రోడ్రి గర్ల్‌ఫ్రెండ్‌ పక్కనుండగానే అటుగా వెళ్లున్న బికినీ యువతిని అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు. తనను దాటి వెళ్లిపోయినా కూడా రోడ్రి మాత్రం వెనక్కి తిరిగి మాత్రం ఆమె అందాన్ని కనులారా ఆస్వాధిస్తూ ముందుకు సాగడం విశేషం. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. 

చాలా మంది రోడ్రి చర్యను స్పానిష్ ఫోటోగ్రాఫర్ ఆంటోనియో గిల్లెం తీసిన 2015 నాటి ప్రసిద్ధ ‘డిస్‌ట్రాక్టడ్ బాయ్‌ఫ్రెండ్’ ఫొటోతో పోలుస్తున్నారు. ఆ ఫోటోలో, చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి, ఎర్రటి టాప్ ధరించి నడుచుకుంటూ వెళ్తున్న ఒక యువతిని చూడటానికి వెనక్కి తిరుగుతాడు, అదే సమయంలో అతడి పక్కనే ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్ మాత్రం అతడి చర్యకు ఆశ్చర్యానికి లోనవుతోంది. 


Photo Credit: Twitter

ఈ ఫొటో అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసి ఒక మీమ్ మెటిరీయల్‌గా మారిపోయింది. తాజాగా రోడ్రి కూడా తన గర్ల్‌ఫ్రెండ్ పక్కన ఉండగానే బికినీ వేసుకున్న యువతిని అదే పనిగా చూడడాన్ని ‘డిస్‌ట్రాక్టడ్ బాయ్‌ఫ్రెండ్‌’ మీమ్ ఫొటోతో పోల్చకుండా ఉండలేకపోతున్నారు.  ‘అయినా అంత అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 

ఇక ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాను చిత్తు చేసింది చాంపియన్‌గా నిలిచింది. 16 సంవత్సరాల తర్వాత రెండో ఫిఫా టైటిల్ సాధించిన స్పెయిన్ జట్టులో రోడ్రి సభ్యుడిగా ఉన్నాడు.

Read: ‘రోబోలు కాదు’.. ఆటగాళ్ల గాయాలపై లక్ష్మణ్‌ ఆగ్రహం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement