గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌! | Sreesanth Attack Gautam Gambhir Get Ms Dhoni As Team-India Mentor | Sakshi
Sakshi News home page

గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌!

Jun 19 2026 11:40 AM | Updated on Jun 19 2026 12:32 PM

 Sreesanth Attack Gautam Gambhir Get Ms Dhoni As Team-India Mentor

టీమిండియా హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్‌పై మాజీ క్రికెట‌ర్ శ్రీశాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. గంభీర్ లాంటి వ్య‌క్తి కోచ్‌గా ప‌నికిరాడ‌ని, అత‌డి స్థానంలో ధోని లాంటి ఫ్రెండ్లీ వ్య‌క్తిని కోచ్‌గా ఎంపిక చేస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. శ్రీశాంత్ వ్యాఖ్య‌లు ఇప్పుడు క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది.  'లల్లన్‌టాప్' వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

'ముందు కోచ్‌ను మార్చండి. భారత్‌కు ఇప్పుడు కావాల్సింది కోచ్ కాదు, ఒక మంచి మెంటార్. ఒక‌ షో సజావుగా సాగడానికి డైరెక్టర్ ఎంత ముఖ్యమో, జట్టుకు కోచ్ కూడా అంతే ముఖ్యం. నాకు సాధారణంగా కోచ్‌లపై ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ అంతర్జాతీయ జట్లకు సాంప్రదాయ కోచ్‌ల కంటే మెంటార్ల అవసరమే ఎక్కువగా ఉంటుంది.

ముఖ్యంగా గంభీర్ అనుసరిస్తున్న కోచింగ్ విధానం ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. ఫెయిల్ అయితే జట్టు నుంచి తీసేస్తామనే భయాన్ని కల్పించి, ఆటగాళ్లను ఒక కఠినమైన వ్యవస్థలోకి నెట్టే కోచ్ జట్టుకు అవసరం లేదు.' అని పేర్కొన్నాడు. 

ఆ త‌ర్వాత ఎంఎస్ ధోని గురించి శ్రీశాంత్ ప్ర‌స్తావించాడు.'జనాలు ఏమైనా చెప్పుకోవచ్చు.. కానీ ధోని ఆలోచనా విధానం, అతను ఆటగాళ్లలో నింపిన ఆత్మవిశ్వాసమే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. గంభీర్ స్థానంలో ధోనికి కోచ్ బాధ్య‌త‌లు అప్ప‌గించాలి.' అని పేర్కొన్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వడంలో గంభీర్‌కు అధిక క్రెడిట్ ఇవ్వ‌డం స‌రికాద‌ని శ్రీశాంత్ వ్యాఖ్య‌నించాడు. 

మైదానంలో చెమటోడ్చి ఆడేది ఆటగాళ్లు, కాబట్టి ఆ గుర్తింపు, క్రెడిట్ వారికే దక్కాల‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. టీ20 ప్రపంచకప్ విజయాన్ని ప్రస్తావిస్తూ.. ఆటగాళ్ల ప్రదర్శనే అక్కడ అత్యంత కీలకమని పేర్కొన్నాడు. ఒకవేళ సంజూ శాంసన్ రాణించకపోయినా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ సరిగ్గా చేయకపోయినా, లేదా సమయానికి బౌలింగ్ మార్పులు జరగకపోయినా మనం గెలిచేవాళ్లమా? మైదానంలోకి వచ్చి కోచ్ ఏమైనా నిర్ణయాలు తీసుకున్నాడా? చెప్పండి అంటూ గంభీర్‌ను ఉద్దేశించి పరోక్షంగా ప్ర‌శ్న‌లు వేశాడు.

అంత‌క‌ముందు మాజీ హాఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌కు శ్రీశాంత్ స‌వాల్ విసిరాడు. ఐపీఎల్ చెంప‌దెబ్బ ఘ‌ట‌న గుర్తుచేసుకున్న శ్రీశాంత్ త‌న వెనుక స్క్రీన్‌పై ఉన్న హ‌ర్భ‌జ‌న్‌ను చూపిస్తూ.. 'నీకు నిజంగా దమ్ముంటే నాతో రింగ్‌లోకి రా.. అక్కడ తేల్చుకుందాం' అని భ‌జ్జీకి స‌ర‌దాగా స‌వాల్ విసిరాడురు. తాను ప్రస్తుతం 'బేర్ నకిల్ ఫైటింగ్ లీగ్'తో సంబంధం కలిగి ఉన్నానని.. కోనర్ మెక్ గ్రోర్‌ వంటి అంతర్జాతీయ ఫైటర్లతో కలిసి పనిచేస్తున్నానని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

 

Read: ఆఫ్గన్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement