టీ20 ప్రపంచకప్-2022లో అదరగొడుతున్న టీమిండియాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు అద్భుతంగా సన్నద్దం అయిందని గవాస్కర్ కొనియాడాడు. కాగా ఈ ఏడాది ఈవెంట్‌లో భారత్ దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. గ్రూపు-2 నుంచి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది.
ఇక ఆదివారం(ఆక్టోబర్ 30) పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇండియా టుడేతో గవాస్కర్ మాట్లాడుతూ... "ఈ సారి ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రిపరేషన్ అద్భుతంగా జరిగింది. ఈ మెగా ఈవెంట్ కోసం 18 రోజుల ముందే భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(పెర్త్)లో దాదాపు 10 రోజులు పాటు టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు.
అయితే పెర్త్‌లోని కొత్త స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు ఆడలేదు. అయితే పాత స్టేడియం నుంచి మట్టిని తెచ్చి పిచ్‌ను తాయారు చేసి చేసినట్లు కన్పిస్తుంది. అందుకే ఈ పిచ్‌లో బంతి ఎక్కువగా బౌన్స్ అవ్వడం చూస్తున్నాం. పాత పిచ్‌లో భారత్ ప్రాక్టీస్ చేసింది కాబట్టి దక్షిణాఫ్రికాపై పై చెయి సాధిస్తుందని" భావిస్తున్నాను అని పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2022: దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. ప్రపంచ రికార్డుకు చేరువలో కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment