IPL 2022: Suryakumar Yadav Likely Miss Opening Match Against Delhi Capitals - Sakshi
Sakshi News home page

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌!

Published Sun, Mar 27 2022 8:56 AM | Last Updated on Sun, Mar 27 2022 11:35 AM

Suryakumar Yadav Likely Miss Opening Match against Delhi Capitals - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌ తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీ కొట్టేందుకు సిద్దమైంది. ఆదివారం (మార్చి 27) బ్రబౌర్న్ వేదికగా సాయంత్రం 3:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబైకు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్‌ తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు సూర్యకుమార్ చేయి ఫ్రాక్చర్‌ అయిన సంగతి తెలిసిందే. అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందిన అతడు.. గాయం నుంచి కోలుకుని శనివారం ముంబై జట్టులో చేరాడు. అయితే గాయం నుంచి కోలుకున్న అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముంబై జట్టు:  రోహిత్ శర్మ (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రీవిస్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్, జయదేవ్ ఉదద్కట్, మయాంక్ మార్కండే, ఎన్ తిలక్ వర్మ, సంజయ్ యాదవ్, జోఫ్రా ఆర్చర్, డేనియల్ సామ్స్, తైమల్ మిల్స్, డేవిడ్, అర్షద్ ఖాన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, రమణదీప్ సింగ్, రాహుల్ బుద్ధి, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, ఫాబియన్ అలెన్, ఆర్యన్ జుయల్, రిలే మెరెడిత్

చదవండి: IPL 2022: వికెట్‌ తీసిన ఆనందం.. బ్రావో డ్యాన్స్‌ అదిరిపోయిందిగా.. వీడియో వైరల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement