
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు భారత జాతీయ గీతాలాపన సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. జాతీయ గీతాలాపన ప్రారంభంకాగానే హిట్‌మ్యాన్ ముఖంలో ఉద్వేగానికిలోనైన హావభావాలు స్పష్టంగా కనిపించాయి. టీ20 వరల్డ్‌కప్‌లో తొలిసారి టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడన్న ఆనందమో లేక ఎలాగైనా ఈ సారి టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టాలన్న కసో.. మొత్తానికి జాతీయ గీతాలాపన సందర్భంగా హిట్‌మ్యాన్ పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
రోహిత్ ఎక్స్‌ప్రెషన్స్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో నవ్వు ఆపుకోలేక హిట్‌మ్యాన్ అలా చేశాడని అని అంటుంటే.. కొందరేమో ఒత్తిడిని కంట్రోల్ చేసుకునేందుకు కెప్టెన్ అలా చేసి ఉంటాడని కామెంట్లు చేస్తున్నారు.
It's a cry of happiness and a great honour. 🐐 @ImRo45 🥺❤️ !!pic.twitter.com/ZmnBnmftRm
— Vishal. (@SportyVishal) October 23, 2022
ఇదిలా ఉంటే, మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న దాయాదుల సమరంలో టీమిండియా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్‌కు అర్షదీప్ ఆరంభంలోనే పెద్ద బ్రేక్ ఇచ్చాడు. రెండో ఓవర్‌లో బాబర్ ఆజమ్, నాలుగో ఓవర్‌లో మహ్మద్ రిజ్వాన్‌లను పెవిలియన్‌కు పంపి పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అనంతరం ఇఫ్తికార్ అహ్మద్ (51), షాన్ మసూద్ (52 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించి పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లకు తలో వికెట్ దక్కింది.