PC: BCCI
T20 World Cup 2021- Can India Qualify Semis After Big Loss How: న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత కూడా అధికారికంగా భారత జట్టు ఇంకా టోర్నీనుంచి నిష్క్రమించలేదు. 14.3 ఓవర్లలోనే మ్యాచ్ కొట్టేయడంతో భారత్ రన్‌రేట్ ఘోరంగా పడిపోయింది. సాధ్యాసాధ్యాల సంగతి ఎలా ఉన్నా అంకెల్లో మాత్రం ఇంకా టీమ్‌కు అవకాశముంది! నమీబియా, స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లను మన కోణంలో ఏకపక్ష విజయాలుగా భావిస్తే బుధవారం అఫ్గానిస్తాన్‌తో జరిగే సమరమే కీలకం కానుంది.
టోర్నీలో అఫ్గాన్ ఆడుతున్న తీరు చూస్తే ఆ జట్టు సంచలనానికి కూడా అవకాశముంది. అయితే భారత్ తమ ‘స్థాయి’కి తగ్గ ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించి... అఫ్గాన్ టీమ్ న్యూజిలాండ్‌ను ఓడిస్తేనే మన టీమ్ అసలు సమీకరణాల లెక్కలోకి వస్తుంది. అప్పటికీ కూడా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఒక వీరాభిమాని తరహాలో కాకుండా నిజాయితీగా ఆలోచిస్తే ఇన్ని లెక్కలను దాటి భారత్ ముందంజ వేయడం దాదాపు అసాధ్యం. ఒక రకంగా టి20 ప్రపంచ కప్‌లో మన ఆట ముగిసినట్లే!
స్కోర్లు:
ఇండియా- 110/7 (20)
న్యూజిలాండ్- 111/2 (14.3)
చదవండి: Virat kohli: అలా చేయలేకపోయాం.. అందుకే రెండింటిలో ఓడిపోయాం.. అయితే
New Zealand on 🔝
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Rohit Sharma is now gone for 14.
Sodhi celebrates a big scalp. #T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/CDRoQaZios
Comments
Please login to add a commentAdd a comment