Ind Vs NZ: ఏందిరా అయ్యా ఇది.. 70 బంతుల దాకా బౌండరీ కొడితే ఒట్టు! | T20 World Cup 2021 Ind Vs NZ: India Hit Boundary After 70 Balls Gap Fans Upset | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021 Ind Vs NZ: ఏందిరా అయ్యా ఇది.. 70 బంతుల దాకా బౌండరీ కొడితే ఒట్టు!

Published Mon, Nov 1 2021 8:05 AM | Last Updated on Mon, Nov 1 2021 10:58 AM

T20 World Cup 2021 Ind Vs NZ: India Hit Boundary After 70 Balls Gap Fans Upset - Sakshi

India Hit Boundary After 70 Balls Gap Fans Upset: టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. కివీస్‌ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా 70 బంతుల గ్యాప్‌ తర్వాత బౌండరీ కొట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితమైన భారత జట్టు... లక్ష్య ఛేదనకు దిగిన విలియమ్సన్‌ సేనను కట్టడి చేయలేక పరాజయం మూటగట్టుకుంది.

70 బంతులదాకా బౌండరీ కొడితే ఒట్టు! 
టాపార్డర్‌ను కోల్పోయాక భారత్‌ పరుగుకే ప్రయాస పడింది. దీంతో బౌండరీ గగనమైంది. బ్యాట్స్‌మెన్‌కు అదో కష్టమన్న పనిగా తయారైంది. న్యూజిలాండ్‌ బౌలర్లంతా కలిసి ఈ కట్టడిలో పాలు పంచుకున్నారు. స్పిన్నర్లు సాన్‌ట్నర్, ఇష్‌ సోధి, సీమర్లు మిల్నే, సౌతీ, బౌల్ట్‌లు దాదాపు 12 ఓవర్లు (11.4) పాటు భారత బ్యాట్స్‌మెన్‌ షాట్‌ను బౌండరీలైన్‌ దాటించకుండా బ్యాట్లను కట్టేశారు.

సౌతీ వేసిన ఆరో ఓవర్‌ తొలి బంతికి రాహుల్‌ బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత మ్యాచ్‌ చూస్తే... వికెట్లే పడ్డాయి. చివరకు 17వ ఓవర్‌ ఆఖరి బంతికి మిల్నే బౌలింగ్‌లో జడేజా ఫోర్‌ బాదాడు. ఈ క్రమంలో 70 బంతులపాటు సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. టి20ల్లో ఇలాంటి మెరుపుల్లేని పొదుపు చాలా అరుదు.

ఏందిరా అయ్యా ఇది!
ధనాధన్‌ లేక, స్కోరు పెరగక, చేతుల్లోని 4, 6 బోర్డులను ఎత్తిపెట్టే అభిమానుల కేరింతలు లేక దుబాయ్‌ స్టేడియం మూగబోయింది. ఇక టీమిండియా బ్యాటర్లు కనీస స్థాయి ప్రదర్శన కనబరచకపోవడంతో ఏందిరా అయ్యా ఇది... ఏం చేశారు.. మరీ ఇంత ఘోరంగా ఆడతారా అన్నట్లుగా అభిమానులు నైరాశ్యంలో మునిగిపోయారు.

స్కోర్లు: 
ఇండియా- 110/7 (20)
న్యూజిలాండ్‌- 111/2 (14.3)

చదవండి: T20 World Cup 2021 Afg Vs Nam: అఫ్గన్‌ జోరు.. మరో భారీ విజయం.. ఏకంగా...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement