PC: ICC
T20 World Cup 2021: Virat Kohli On India Beat Afghanistan By 66 Runs: టీ20 ప్రపంచకప్- 2021 టోర్నీలో కోహ్లి సేన తొలి విజయం సాధించింది. అఫ్గనిస్తాన్‌ను 66 పరుగుల తేడాతో మట్టికరిపించి జయభేరి మోగించింది. వరుస పరాజయాలకు ముగింపు పలుకుతూ... పండుగ వేళ అభిమానులను ఖుషీ చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(69), రోహిత్ శర్మ(74) సహా రిషభ్ పంత్(27- నాటౌట్), హార్దిక్ పాండ్యా(35- నాటౌట్) రాణించడంతో భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బౌలర్లు సైతం తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడంతో విజయం లాంఛనమే అయింది.
అన్నింటి కంటే పెద్ద సానుకూలాంశం అదే..
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశాడు. అశ్విన్ రాక ఈ మ్యాచ్‌లో అన్నింటి కంటే పెద్ద సానుకూలాంశంగా పరిణమించిందని పేర్కొన్నాడు. ‘‘వికెట్ ఎంతో బాగుంది. గత మ్యాచ్‌ల గురించి చెప్పాలంటే... మొదటి రెండు ఓవర్లలో కాస్త కుదురుకుని ఉంటే... ప్రత్యర్థి జట్టును ఒత్తిడికి గురిచేయగలమనే నమ్మకం వచ్చేది.
అలాంటపుడు మా ఆట తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కొన్నిసార్లు ఒత్తిడి ముందు తలొగ్గాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మనం ఆమోదించగలగాలి. టీ20 క్రికెట్ అంటేనే కాస్త భిన్నంగా ఉంటుంది.
ఈరోజు ఓపెనర్లు శుభారంభం అందించారు. పవర్ హిట్టర్లు సిద్ధంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే గత మ్యాచ్‌లలో ఒత్తిడి అధిగమించలేకపోయాం. ఆయా జట్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాయి. ఇక రన్‌రేటు విషయానికొస్తే.. మేము సానుకూల దృక్పథంతో ఉన్నాం. ఎల్లపుడూ అలాగే ఉంటాం కూడా.
ఈరోజు అశ్ తిరిగి రావడమే అన్నింటికంటే అతిపెద్ద సానుకూల అంశం. ఐపీఎల్‌లో తన ఆటతీరు చూశాం. అశ్ రాక నాకు చాలా చాలా సంతోషంగా ఉంది’’అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా అఫ్గన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన అశ్విన్... 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసి తన విలువను చాటుకున్నాడు.
చదవండి: టీ20 ప్రపంచకప్-2021లో రికార్డు సృష్టించిన టీమిండియా..
Ashwin strikes again 👊
— T20 World Cup (@T20WorldCup) November 3, 2021
Afghanistan lose half their side as Najibullah is bowled for 11. #T20WorldCup | #INDvAFG | https://t.co/ZJL2KKL30i pic.twitter.com/ktU2hThY9B
Comments
Please login to add a commentAdd a comment