టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్.. 30 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన హార్దిక్ రెండో బంతికి షాదాబ్ ఖాన్‌ను ఔట్ చేయగా.. అఖరి బంతికి యువ ఆటగాడు హైదర్ అలీని పెవిలియన్‌కు పంపాడు.
కాగా హైదర్ అలీని ఔట్ చేసిన వెంటనే బ్యాటర్ వైపు చూస్తూ నవ్వుకున్నాడు. హార్దిక్ వేసిన లెంగ్త్ బాల్‌ను హైదర్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి నేరుగా సూర్యకుమార్ యాదవ్ చేతికి వెళ్లింది. కాగా హైదర్ అలీని ఔట్ చేసిన వెంటనే బ్యాటర్ వైపు హార్ధిక్ చూస్తూ.. ఆడింది చాలు వెళ్లు అన్నట్టు నవ్వుకున్నాడు. ఇందకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా మూడు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశారు. వీరితో పాటు భువనేశ్వర్, షమీ చెరో వికెట్ సాధించి పర్వాలేదనిపించారు.
ఇక పాక్ బ్యాటర్లలో షాన్ మసూద్(52), ఇఫ్తికర్ ఆహ్మద్(51) పరుగులతో రాణించారు. పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా మూడు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశారు. వీరితో పాటు భువనేశ్వర్, షమీ చెరో వికెట్ సాధించి పర్వాలేదనిపించారు. ఇక పాక్ బ్యాటర్లలో షాన్ మసూద్(52), ఇఫ్తికర్ ఆహ్మద్(51) పరుగులతో రాణించారు.
చదవండి: T20 WC IND VS PAK: జాతీయ గీతాలాపన సమయంలో ఎమోషనల్ అయిన రోహిత్
Comments
Please login to add a commentAdd a comment