పుణే: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు తొలి విజయం నమోదు చేసింది. పూల్ ‘హెచ్’లో భాగంగా గుజరాత్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 12–0 గోల్స్ తేడాతో జయభేరి మోగించింది. తెలంగాణ తరఫున కెపె్టన్ ఈదుల జ్యోతి (24వ, 26వ, 27వ ని.లో) ‘హ్యాట్రిక్’ సాధించగా... గంధపు శ్రీచందన (9వ, 37వ ని.లో), హర్లీన్ కౌర్ సర్దాని (14వ, 47వ ని.లో), ప్రీతి దార్ల (25వ, 57వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు.
చెక్కల అనూష (44వ ని.లో), అఖిల మాండ్లా (45వ ని.లో), ముప్పాల వర్షిత (56వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. తమిళనాడుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment