భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు థాయ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో చుక్కెదురైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు శనివారం జరిగిన సెమీస్‌లో ఒలింపిక్ ఛాంపియన్, ప్రపంచ నాలుగో సీడ్ చెన్ యు ఫీ (చైనా) చేతిలో వరుస గేమ్‌ల్లో పరాజయం పాలైంది. కేవలం 43 నిమిషాల్లో ముగిసిన ఈ పోటీలో ఆరో సీడ్ సింధు 17-21, 16-21 తేడాతో ఓటమి చెందింది. ఫలితంగా ఆమె పోరాటం సెమీస్‌లోనే ముగిసింది.
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్.. ఈ పోటీలో సింధుకు ఊపిరాడనీయకుండా వరుస క్రమంలో పాయింట్లు సాధించి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు చెన్‌పై 6-4 ఆధిక్యం కలిగిన సింధు.. ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక చేతులెత్తేసింది. ఈ ఇద్దరు చివరిసారిగా 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో తలపడగా అప్పుడు కూడా చెన్‌నే విజయం వరించింది. కాగా, సింధు ఈ టోర్నీ క్వార్టర్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ అకానె యమగూచీకి షాకిచ్చి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే.
చదవండి: చెస్ వరల్డ్ చాంపియన్‌కు మరోసారి షాకిచ్చిన భారత కుర్రాడు
Comments
Please login to add a commentAdd a comment