
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ప్రణయ్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... సైనా నెహ్వాల్, అష్మిత, ఆకర్షి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. శ్రీకాంత్ 18–21, 21–10, 21–16తో లెవెర్‌డెజ్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు.
సౌరభ్ వర్మ 20–22, 12–21తో తోమా పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సాయిప్రణీత్ 12–21, 13–21తో వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్) చేతిలో, ప్రణయ్ 17–21, 21–15, 15–21తో డారెన్ లూ (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21–19, 18– 21, 21–18తో లారెన్ లామ్ (అమెరికా)పై... మాళవిక 17–21, 21–15, 21–11తో ఉలితినా (ఉక్రెయిన్) పై నెగ్గగా.. సైనా 21–11, 15–21, 17–21తో కిమ్ గా ఉన్ (కొరియా) చేతిలో, ఆకర్షి 13–21, 18–21 తో మిచెల్లి (కెనడా) చేతిలో, అష్మిత 10–21, 15– 21తో రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడారు.
Comments
Please login to add a commentAdd a comment