
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో తుర్క్‌మెనిస్తాన్ ఎట్టకేలకు పతకాల బోణీ చేసింది. ‘టోక్యో’లో మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 59 కేజీల విభాగంలో పొలీనా గుర్యెవా 217 కేజీలు (స్నాచ్‌లో 96+క్లీన్ అండ్ జెర్క్‌లో 121) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయాక వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో (1996 అట్లాంటా నుంచి 2016 రియో ఒలింపిక్స్) తుర్క్‌మెనిస్తాన్ క్రీడాకారులు పోటీపడినా పతకం సాధించలేకపోయారు.