
టోక్యో: కరోనా వైరస్ నేపథ్యంలో జపాన్ వాసుల ఆరోగ్య పరిరక్షణ కోసం టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరుగనున్న ఈ విశ్వక్రీడల్లో పాల్గొనే క్రీడాకారులతో పాటు ప్రత్యక్షంగా తిలకించడానికి వచ్చే అభిమానులకు వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తున్నట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ సోమవారం ప్రకటించారు.
జపాన్ ప్రధాని యోషిహిడో సుగాతో భేటీ అనంతరం థామస్ బాచ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ‘జపాన్ వాసుల ఆరోగ్య భద్రతను పరిగణలోకి తీసుకున్నాం. క్రీడల నిర్వహణ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే క్రీడాకారులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకునేలా ఐఓసీ చర్యలు తీసుకుంటుంది. అభిమానులకు కూడా దీన్ని తప్పనిసరి చేస్తున్నాం. ఈ చర్యతో సురక్షిత వాతావరణంలో క్రీడలు జరగడంతో పాటు అభిమానులు కూడా ఎలాంటి భయం లేకుండా ఒలింపిక్స్‌ను ఆస్వాదిస్తారు’ అని బాచ్ వివరించారు. కరోనాతో వాయిదా పడిన ఒలింపిక్స్ వచ్చే ఏడాది జూలై 23 నుంచి జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment