కాన్‌బెర్రా: వన్డే ఫార్మాట్‌లో 12వేల పరుగుల్ని అత్యంత వేగవంతంగా చేరుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో కోహ్లి 12వేల పరుగుల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా 251 మ్యాచ్‌ల్లోనే ఆ ఫీట్‌ను సాధించిన క్రికెటర్‌గా కోహ్లి రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. దీనిపై మ్యాచ్ తర్వాత సునీల్ గావస్కర్ మాట్లాడుతూ..‘ అన్ని ఫార్మాట్లలో కోహ్లి హవా కొనసాగుతోంది. కోహ్లి ప్రదర్శన అద్భుతంగా ఉంది. అండర్-19 ప్లేయర్‌గా కోహ్లిని చూసిన దగ్గర్నుంచీ అతను రోజురోజుకూ మెరగవుతూనే ఉన్నాడు. అతను గేమ్‌ను మార్చుకోవడానికి కోహ్లి చాలా శ్రమించాడు. సూపర్ ఫిట్ క్రికెటర్ కావడానికి చాలా త్యాగాలు కూడా చేశాడు. (చదవండి: ‘ధోని చెప్పాడు.. నేను ఫాలో అవుతున్నా’)
కోహ్లి కేవలం యువ క్రికెటర్లకే ఆదర్శ కాదు.. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే వాళ్లందరికీ అతనొక స్ఫూర్తి. ఒక ఫార్మాట్‌లో 12వేలకు పైగా పరుగులంటే ఎంతో ప్రతిభ ఉండాలి. అతను ఆడిన 251 వన్డే గేమ్‌లకు గాను 103 సార్లు యాభైకి పైగా పరుగులు చేశాడంటే అతని ప్రదర్శన నిజంగా అసాధారణం. వన్డేల్లో 43 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. అత్యంత వేగంగా కోహ్లి సాధించిన ఈ ఫీట్‌ను మరొకరు సాధిస్తారని నేను అనుకోవడం లేదు. హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మార్చుకోవడానికి కోహ్లిలోని నిలకడే కారణం. కోహ్లి తదుపరి వెయ్యి పరుగులు గురించి మనం వేచిచూద్దాం. మరో 5 నుంచి 6 నెలల్లోనే దాన్ని సాధిస్తాడని ఆశిద్దాం’ అని తెలిపాడు. ఆసీస్‌తో మూడో వన్డేలో కోహ్లి 63 పరుగులు సాధించాడు. దాంతో వన్డేల్లో 12వేల పరుగుల ఫీట్‌ను సాధించిన కోహ్లి.. ప్రస్తుతం 12,040 పరుగులతో ఉన్నాడు. (చదవండి: హ్యాట్సాఫ్ జడేజా : మంజ్రేకర్)
Comments
Please login to add a commentAdd a comment