
ముంబై: ‘‘మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. మా జీవితంలోని సంతోషకర సమయాన్ని మీతో కలిసి ఆస్వాదించాలని భావిస్తున్నాం. అయితే తల్లిదండ్రులుగా మీకు మాదో చిన్న విన్నపం. మా పాపాయి గోప్యతకు భంగం కలగకుండా తనను సంరక్షించుకోవాలని భావిస్తున్నాం. అందుకు మీ సహాయ సహకారాలు కావాలి’’ అని విరుష్క దంపతులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కుమార్తె ఫొటోలు తీయవద్దని పాపారాజీ(సెలబ్రిటీల వెంటపడి ఫొటోలు తీసే ఫొటోగ్రాఫర్లు)లకు విజ్ఞప్తి చేశారు. కాగా బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి జంటకు సోమవారం ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే.(చదవండి: ఒకే రోజు తల్లులైన అనుష్క, బబిత)
ఈ క్రమంలో ఆ చిన్నారి ఫొటో ఇదేనంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని చిత్రాలు చక్కర్లు కొడుతున్నాయి. చిన్నారి అనుష్క రూపాన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో పాపరాజీలు సైతం విరుష్క జంట కనబడితే చాలు ఫొటోలు క్లిక్‌మనిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో కోహ్లి- అనుష్క.. ‘‘మాకు సంబంధించిన ఫొటోలు తీసుకోండి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మా చిన్నారి ఫొటోలు తీయవద్దు. మా ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. థాంక్యూ’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా తమ సంతానాన్ని మీడియా ప్రభావం పడకుండా, అభ్యుదయ భావజాలంతో పెంచుతానని అనుష్క గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కోహ్లి సైతం కుమార్తె జన్మించిన విషయాన్ని ప్రకటిస్తూ చేసిన ట్వీట్‌లో.. తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేశాడు.(చదవండి: ఆకతాయిలుగా పెంచాలనుకోవడం లేదు: అనుష్క)
Comments
Please login to add a commentAdd a comment