ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి ఆర్‌సీబీ తరపున అరుదైన రికార్డు అందుకున్నాడు. ఆర్‌సీబీ ఓపెనర్‌గా మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. మ్యాచ్‌లో 49 బంతుల్లో 82 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఇక కోహ్లి ఓవరాల్‌గా 224 మ్యాచ్‌ల్లో 6695 పరుగులు సాధించాడు.
అంతేకాదు ఐపీఎల్‌లో 50 ప్లస్ స్కోర్ల విషయంలో(సెంచరీలతో కలిపి) కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. ముంబైతో మ్యాచ్‌లో అర్థసెంచరీతో మెరిసిన కోహ్లికి 50 ప్లస్ స్కోరు చేయడం 50వ సారి. ఐపీఎల్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో డేవిడ్ వార్నర్ (60), కోహ్లి (50) రెండు, శిఖర్ ధావన్ (49) మూడు, 43 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో ఏబీ డివిలియర్స్ నాలుగో స్థానంలో, 41 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు.
Virat Kohli completed 3000 runs as an opener in IPL and also King 👑 scored his 45th half-century...
— Virat Kohli Trends (@Trend_Virat) April 2, 2023
Goat 🐐 for a reason 🔥🥵...#ViratKohli𓃵 | @imVkohli #RCBvsMI #RCB pic.twitter.com/vFdtl8Nzgn
Comments
Please login to add a commentAdd a comment