బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అద్బుతమైన విజయంతో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు కంగారులతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్(పింక్‌బాల్ టెస్టు)గా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్తశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ ఆడిలైడ్ టెస్టుకు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.
కోహ్లి కన్నేసిన రికార్డులు ఇవే..
👉ఆసీస్‌తో రెండో టెస్టులో కోహ్లి మరో సెంచరీ సాధిస్తే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు(10) చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్‌ను అధిగిమిస్తాడు. ప్రస్తుతం ఈ ఐకానిక్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్(9)తో కలిసి కోహ్లి సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నాడు.
👉అదే విధంగా అడిలైడ్ ఓవల్‌లో విరాట్ కోహ్లి ఇప్పటివరకు మూడు టెస్టు సెంచరీలు సాధించాడు. ఇప్పుడు రెండో టెస్టులో కోహ్లి మరో శతకం నమోదు చేస్తే.. ఆస్ట్రేలియా గడ్డపై ఒకే వేదికలో అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లండ్ లెజెండ్ జాక్ హాబ్స్ పేరిట ఉంది.
చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment