ప్రపంచకప్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఓ అత్యంత అరుదైన ప్రపంచ రికార్డు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. 2019 వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. అప్పటివరకు ప్రపంచకప్ టోర్నీల్లో ఏ కెప్టెన్ ఈ ఘనతను సాధించలేదు. నాటి వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 18 పరుగులు మాత్రమే చేసి ఔటైన కోహ్లి ఆతర్వాత జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసి ఇరగదీశాడు.
ఆస్ట్రేలియాపై 82, పాకిస్తాన్‌పై 77, వెస్టిండీస్‌పై 72, ఆఫ్ఘనిస్తాన్‌పై 77, ఇంగ్లండ్‌పై 66 పరుగులు చేసిన కోహ్లి ఈ వరల్డ్‌కప్‌లో సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. వరల్డ్‌కప్ టోర్నీల్లో కెప్టెన్ హోదాలో వరుస హాఫ్ సెంచరీ రికార్డు గతంలో ఆస్ట్రేలియా ఆరోన్ ఫించ్, సౌతాఫ్రికా గేమ్ స్మిత్ పేరిట ఉండింది. వీరిద్దరు వరల్డ్‌కప్ టోర్నీల్లో కెప్టెన్లుగా వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేశారు.
ఇదిలా ఉంటే, 2023 ప్రపంచకప్ భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో వరల్డ్‌కప్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్‌కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు భారత్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం అన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాయి. అక్టోబర్ 8న జరిగే మ్యాచ్‌తో ఈ వరల్డ్‌కప్‌లో భారత్, ఆస్ట్రేలియా జర్నీ స్టార్ట్ అవుతుంది. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. ఈనెల 14న టీమిండియా పాకిస్తాన్‌తో తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment