ట్రినిడాడ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పోటీ ఇస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి విండీస్ 229 పరుగులు చేసింది. కరేబియన్ జట్టు ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో అలిక్ అతనజ్(37), హోల్డర్(11) పరుగులతో ఉన్నారు. అంతకుముందు విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్(75) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అశ్విన్ స్పిన్ మ్యాజిక్..
ఇక ఈ మ్యాచ్‌లో విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్‌ను భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. అశ్విన్ వేసిన డెలివరికి బ్రాత్‌వైట్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. విండీస్ ఇన్నింగ్స్ 75 ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో మూడో బంతిని బ్రాత్‌వైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.
అయితే ఆఫ్‌సైడ్ పడిన బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన విండీస్ కెప్టెన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ టెస్టు సిరీస్‌లో అశ్విన్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఏకంగా 12 వికెట్లు పడగొట్టి అతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. రెండో టెస్టులో ఇప్పటివరకు 33 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ ఓ కీలక వికెట్ సాధించాడు.
చదవండి: పెళ్లి చేసుకున్న సన్‌రైజర్స్ కెప్టెన్.. అమ్మాయి ఎవరంటే?
Unplayable! A classic off-spinner's dismissal from Ashwin 🔥 #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/dPcUucA0xQ
— FanCode (@FanCode) July 22, 2023
Comments
Please login to add a commentAdd a comment