విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో)
సొంతగడ్డపై మరోసారి వన్డే వరల్డ్‌కప్ టోర్నీ ఆడేందుకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సన్నద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్ కోసం బుధవారమే రన్‌మెషీన్ నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్ బౌలర్లతో పాటు టీమిండియా స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ బ్యాటింగ్ చేస్తూ బీస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. కాగా గురువారం (అక్టోబరు 5) ఇంగ్లండ్- న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో వన్డే ప్రపంచకప్-2023కి తెరలేచింది.
ఈ క్రమంలో అక్టోబరు 8న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా.. విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తదితరులు నెట్స్‌లో చెమటోడ్చారు
ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా కోహ్లి సుమారు రెండున్నర గంటల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. మిగతా వాళ్లతో పోలిస్తే అదనంగా 45 నిమిషాల పాటు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా అంకితభావానికి మారుపేరైన కోహ్లి 2011 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2015, 2019(కెప్టెన్) ఎడిషన్లలోనూ ఆడాడు. అయితే, రెండు సందర్భాల్లోనూ టీమిండియాకు ఆశించిన ఫలితాలు రాలేదు.
ఈ నేపథ్యంలో మరోమారు సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్ జరుగుతున్న తరుణంలో కింగ్ రెండోసారి ట్రోఫీని ముద్దాడితే చూడాలని ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసీస్‌తో మ్యాచ్ కోసం గురువారమే చెన్నైకి చేరుకున్న టీమిండియా కొత్తగా ఆరెంజ్ కలర్ జెర్సీలో ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment