
Courtesy: IPL Twitter
IPL 2022 DC Vs SRH: ఐపీఎల్-2022లో బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు గురువారం(మే5) తలపడనున్నాయి. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని ఎస్‌ఆర్‌హెచ్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. తొమ్మిది మ్యాచ్‌లలో ఐదు విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
ఇక గత రెండు మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు అద్భుతంగా రాణించనప్పటికీ.. బౌలర్లు మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ, పూరన్, మాక్రమ్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసిచ్చే ఆంశం. ఇక జానెసన్ స్థానంలో సీన్ ఆబాట్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే.. తచ చివరి మ్యాచ్‌లో లక్నోపై ఓటమి పాలైంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా,మిచెల్ మార్ష్, పంత్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ పరంగా కూడా ఢిల్లీ అద్భుతంగా రాణిస్తోంది.
హెడ్ టూ హెడ్ రికార్డులు
ఇరు జట్లు ఇప్పటి వరకు ముఖాముఖి 9 సార్లు తలపడగా.. ఎస్‌ఆర్‌హెచ్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్‌ల్లో గెలిపొందింది.
పిచ్ రిపోర్ట్
బ్రబౌర్న్ స్టేడియంలో మునుపటి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరగింది. బ్రబౌర్న్ పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బౌలింగ్ చేసే అవకాశం ఉంది
తుది జట్లు అంచనా
ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, చేతన్ సకారియా
సన్‌రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, సీన్ ఆబాట్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
చదవండి: Glenn Maxwell: రనౌట్ ఎఫెక్ట్! నీతో కలిసి బ్యాటింగ్ చేయలేను కోహ్లి.. నేను నీలా కాదు!
Comments
Please login to add a commentAdd a comment