David Warner Plays Shot Of The Tournament In IPL 2022 Match Against SRH, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2022 - David Warner: 'ఇదేం షాట్‌ వార్నర్‌ భయ్యా.. మైండ్‌ బ్లాంక్‌'.. వీడియో వైరల్‌

Published Fri, May 6 2022 1:51 PM | Last Updated on Fri, May 6 2022 2:57 PM

David Warner Plays Shot Of The Tournament In IPL 2022 Match Against SRH - Sakshi

డేవిడ్‌ వార్నర్‌(PC: IPL/BCCI)

ఐపీఎల్‌-2022లో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన వార్నర్‌.. తరువాత గేర్‌ మార్చి బౌండరీల వర్షం కురిపించాడు. 58 బంతుల్లో ఏకంగా 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో వార్నర్‌ అజేయంగా నిలిచాడు. కాగా భువనేశ్వర్‌ కుమార్‌ ఓవర్‌లో వార్నర్‌ ఆడిన షాట్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ తొలి బంతిని వేయడానికి సిద్దమయ్యాడు. అయితే స్ట్రైక్‌లో ఉన్న వార్నర్‌ స్విచ్‌ హిట్‌ ఆడేందుకు రెడీ అయ్యాడు.

అయితే ముందుగానే పసికట్టిన భువీ.. వైడ్‌ యార్కర్‌ వేశాడు. అయితే భువనేశ్వర్ బౌలింగ్‌ తగ్గట్టుగానే.. వార్నర్‌ క్షణాల్లో తన ప్లాన్ మార్చుకుని రైట్ హ్యాండర్ ఆడినట్లు షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియోపై నెటిజన్‌ స్పందిస్తూ.."ఇదేం షాట్‌ వార్నర్‌ భయ్యా.. మైండ్‌ బ్లాంక్‌" అని కామెంట్‌ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై ఢిల్లీ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

చదవండి: David Warner: ‘ప్రతీకారం తీర్చుకున్న వార్నర్‌’.. ఆ ఒక్క మాట చాలు.. దెబ్బ అదుర్స్‌ కదూ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement