
ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. బౌలర్లు అద్భతంగా రాణించడంతో 145 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని ఢిల్లీ కాపాడుకోగలిగింది. 145 పరుగుల లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్(49) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, నోర్జే తలా రెండు వికెట్లు సాధించగా.. కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఫ్రాంచైజీ డిఫెండ్ చేసిన అత్యల్ప లక్ష్యం ఇదే కావడం విశేషం.
అంతకుముందు 2009 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డేవిల్స్ 150 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసింది. ఇప్పటివరకు ఇదే ఢిల్లీ డేర్‌డేవిల్స్ కాపాడుకున్న అత్యల్ప లక్ష్యంగా.. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డును వార్నర్ సేన అధిగిమించింది.
చదవండి: IPL 2023: ఈ మాత్రం ఆటకేనా 13 కోట్లు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో