
PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కాలికి దండం పెట్టాడు. టాస్ సందర్భంగా మైదానంలోకి వచ్చిన వార్నర్ పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడే వార్మాప్ చేస్తున్న భువీ పాదాలను తాకాడు.
వెంటనే భువీ వార్నర్‌ను పైకి లేపి ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వార్నర్, భువనేశ్వర్ కలిసి కొన్ని సీజన్‌లపాటు సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.
అది మరోసారి రుజువైంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు, వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు సాధించారు.
చదవండి: #Washington Sundar: హమ్మయ్య.. ఎట్టకేలకు సాధించాడు! సన్‌రైజర్స్‌కు ఇక చాలు
This visual is all 🧡 💙!
— IndianPremierLeague (@IPL) April 24, 2023
Follow the match ▶️ https://t.co/ia1GLIWu00#TATAIPL | #SRHvDC | @SunRisers | @DelhiCapitals | @BhuviOfficial | @davidwarner31 pic.twitter.com/t9nZ95dyJ7