IPL 2022 GT Vs RR: Reason Behind Why Hardik Pandya Left The Field During Match, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2022 RR Vs GT: హార్ధిక్‌ పాండ్యాకు ఏమైంది.. ? మ్యాచ్‌ మధ్యలోనే వెళ్లిపోయాడు!

Published Fri, Apr 15 2022 8:14 AM | Last Updated on Fri, Apr 15 2022 10:25 AM

Why Hardik left the field in Rajasthan vs Gujarat Match In IPl 2022 - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్‌ విజయంలో కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచిన హార్ధిక్‌.. బౌలింగ్‌లో కూడా 18 పరుగులు ఇచ్చి కీలక వికెట్‌ పడగొట్టాడు. కాగా రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన హార్ధిక్‌ పాండ్యా.. కేవలం మూడు బంతులు మాత్రమే వేసి ఫీల్డ్‌ను విడిచి పెట్టాడు.

ఈ ఓవర్‌లో హార్ధిక్‌ రెండో బంతికే జిమ్మీ నీషమ్‌ వికెట్‌ పడగొట్టి మ్యాచ్‌ను గుజరాత్‌ వైపు పూర్తిగా తిప్పేశాడు. అయితే గజ్జ గాయం కారణంగా అతడు ఫీల్డ్‌ను విడిచి పెట్టి వెళ్లినట్లు  తెలుస్తోంది. మిగితా ఓవర్‌ను విజయ్‌ శంకర్‌ పూర్తి చేశాడు. అయితే హార్థిక్‌ గాయం అంత తీవ్రమైనది కాదని సమాచారం.

ఇ​క మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ హార్ధిక్‌ పాండ్యా(87) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది.  గుజరాత్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ ,యశ్‌ దయాళ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. హార్ధిక్‌,షమీ, తలా ఒక్క వికెట్‌ సాధించారు.

చదవండి: IPL 2022: హార్దిక్‌ పాండ్యా మెరుపులు.. రాజస్తాన్‌పై గుజరాత్‌ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement