
పాట్చెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): ప్రపంచకప్ జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది. జర్మనీ జట్టుతో ఆదివారం జరిగిన పూల్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–1 గోల్స్ తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్ తరఫున లాల్‌రెమ్‌సియామి (2వ ని.లో), ముంతాజ్ ఖాన్ (25వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది.