Women Hockey World Cup: India Dream Ends After Loss To Spain - Sakshi
Sakshi News home page

Womens Hockey World Cup: కీలక పోరులో స్పెయిన్ చేతిలో ఓడిన టీమిండియా

Published Mon, Jul 11 2022 7:17 PM | Last Updated on Mon, Jul 11 2022 8:35 PM

Women Hockey World Cup: India Dream Ends After Loss To Spain - Sakshi

భారీ అంచనాల నడుమ ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆతిధ్య స్పెయిన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సవిత పూనియా నేతృత్వంలోని టీమిండియా 0-1 తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా కనీసం క్వార్టర్స్‌కు కూడా చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు చివరి నిమిషం వరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ]

మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా.. మార్తా సేగు గోల్‌ చేసి స్పెయిన్‌ను గెలిపించింది. ఈ విజయంతో స్పెయిన్‌.. న్యూజిలాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లతో పాటు క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. క్వార్టర్స్ మ్యాచ్‌లు రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయి. జులై 16, 17 తేదీల్లో సెమీస్.. 18న ఫైనల్ మ్యాచ్‌ జరుగుతుంది.
చదవండి: Shooting World Cup: ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌ ఫైనల్లో అర్జున్, పార్థ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement