దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ ప్లేస్‌కు చేరింది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన నాల్గో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ విజయం సాధించడం ద్వారా టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ను కోహ్లి గ్యాంగ్ వెనక్కి నెట్టింది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం టీమిండియా 122 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరగా, న్యూజిలాండ్ 118 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇక ఆస్ట్రేలియా 113 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, ఇంగ్లండ్ 105 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆపై పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, అప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌లు వరుస స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ చదవండి: ఎట్టకేలకు ‘24’ను బ్రేక్ చేశారు..
ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌పై తాజా విజయంతో టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానానికి ఎగబాకింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ లో భాగంగా 2019-2021 మధ్య కాలంలో టీమిండియా 17 టెస్టులు ఆడి 12 విజయాలు సాధించగా, 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒకదాన్ని మాత్రం డ్రా చేసుకుంది. ఫలితంగా ఐసీసీ ప్రవేశపెట్టిన పర్సంటేజ్ ఆఫ్ పాయింట్లలో 72.2 శాతం విజయాలను ఖాతాలో వేసుకుని టీమిండియా టాప్‌కు చేరింది. ఇక్కడ న్యూజిలాండ్ 11టెస్టులకు గాను 7 విజయాలు, 4 ఓటములు చవిచూసింది. దాంతో కివీస్ విజయాల శాతం 70.0గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment