రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. యువ సంచలనం యశస్వీ జైశ్వాల్ గాయం కారణంగా రాంఛీ టెస్టు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జైశ్వాల్ ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో వెన్ను నొప్పితో బాధపడుతూనే యశస్వీ డబుల్ సెంచరీతో చెలరేగాడు.
వెన్ను నొప్పి కారణంగా మూడో రోజు ఆటలో సెంచరీ పూర్తిచేశాక రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన జైశ్వాల్.. మళ్లీ నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌కు వచ్చి తన రెండో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ ఫీల్డింగ్ సందర్భంగా కూడా జైశ్వాల్ కాస్త ఆసౌక్యర్యంగా కన్పించాడు. ఈ క్రమంలో అతడికి రాంఛీ టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మెన్‌జ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముందు టీ20 వరల్డ్‌కప్ ఉండడంతో అతడిని రిస్క్ చేయకూడదని మెన్‌జ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముంబైకర్‌ను మళ్లీ ధర్మశాల వేదికగా జరగనున్న ఐదో టెస్టులో ఆడించాలని హెడ్‌కోచ్ ద్రవిడ్ సైతం ఫిక్స్ అయినట్లు వినికిడి. ఈ క్రమంలో కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్ అరంగేట్రానికి సిద్దమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
పడిక్కల్ సైతం రంజీ ట్రోఫీ2023-24 సీజన్‌లో దుమ్మురేపాడు. దీంతో అతడిని బ్యాకప్ ఓపెనర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. పడిక్కల్ ప్రస్తుతం జట్టుతో పాటే ఉన్నాడు. ఒకవేళ జైశ్వాల్ నాలుగో టెస్టుకు దూరమైతే భారత్‌కు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఈ సిరీస్‌లో జైశ్వాల్ ప్రస్తుతం 545 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. ఇప్పటికే వరుసగా రెండు డబుల్ సెంచరీలు కూడా బాదేశాడు. కాగా ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: రికార్డు ఛేజింగ్..90 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment