ఈసారి ఎలాగైనా ఐపీఎల్ కప్ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ లీగ్ దశను విజయవంతంగా ముగించింది. శుక్రవారం సీఎస్కేతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్ మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. రాజస్తాన్ తమ లక్ష్యాన్ని అందుకోవడానికి మరో రెండు మ్యాచ్‌ల దూరంలో ఉంది. మే 24న గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుంది.
ఇక సీఎస్కేతో మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న జాస్ బట్లర్, కెప్టెన్ సంజూ శాంసన్‌లు చేజింగ్‌లో విఫలమయ్యారు. ఈ దశలో యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పరుగులు రావడం కష్టమైన దశలో నాణ్యమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 59 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జైశ్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
PC: IPL Twitter
''బట్లర్, శాంసన్‌లు ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌ల్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. ఒకవేళ వాళ్లు విఫలమైతే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిందే. ఇదే పనిని సీఎస్‌కేతో మ్యాచ్‌లో జైశ్వాల్, అశ్విన్ చేసి చూపెట్టారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో యశస్వి ఆడిన తీరుచూస్తే బట్లర్, శాంసన్‌ల కంటే బెటర్‌గా కనిపించాడు. ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్ ఔటయ్యాకా జైశ్వాల్ బ్యాటింగ్‌లో కాస్త స్లోడౌన్ అయ్యాడు. ఆ సమయంలో ఇది చాలా అవసరం. ఎందుకంటే రాజస్తాన్‌కు ధోని లాంటి ఫినిషర్ లేడు. అదృష్టవశాత్తూ అశ్విన్ తన ఫినిషింగ్‌తో రాజస్తాన్‌కు ఘన విజయాన్ని అందించాడు. ఒత్తిడిలో బ్యాటింగ్ చేసిన జైశ్వాల్ బ్రిలియంట్‌కు మెచ్చుకోవాల్సిందే.
అశ్విన్‌తో కలిసి జైశ్వాల్ గేమ్‌ను ఎండ్ చేసి ఉంటే ఫన్‌గా అనిపించేది. ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడు, యంగ్ ప్లేయర్ కలిసి మ్యాచ్‌ను గెలిపిస్తే చూడడానికి బాగుంటుంది. ఈ ప్రక్రియలో యువ ఆటగాడు తన బ్యాటింగ్‌లో మరిన్ని టెక్నిక్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా జైశ్వాల్‌కు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా. 'మంచిగా ఆడుతున్నప్పుడు పెద్ద స్కోరు చేయడానికి ప్రయత్నించు.. తర్వాతి మ్యాచ్‌లో తొందరగా ఔటైతే ఆ అవకాశం మళ్లీ రాకపోవచ్చు.' అంటూ'' పేర్కొన్నాడు.
చదవండి: Ravichandran Ashwin: 'రాసిపెట్టుకోండి.. రాజస్తాన్ కప్ కొట్టబోతుంది..'
Comments
Please login to add a commentAdd a comment