
భార్య ధన శ్రీ వర్మతో యజువేంద్ర చహల్(PC: Yuzvendra Chahal)
Yuzvendra Chahal- Dhanashree Verma: టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడా? భార్య ధనశ్రీ వర్మతో అతడి అనుబంధం బాగానే ఉందా? లేదా అభిప్రాయభేదాలేమైనా తలెత్తాయా? లేదంటే విషయం ఇంకేదైనా ఉందా అన్న ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. కెరీర్‌లో మెరుగైన దశలో ఉన్న చహల్ పర్సనల్ లైఫ్‌లో మాత్రం సమస్యలు ఎదుర్కొంటున్నాడా అని ఆరాలు తీస్తున్నారు ఫ్యాన్స్! ఈ నేపథ్యంలో చహల్- ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు.
కెరీర్‌లో ఎత్తుపళ్లాలు!
కాగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్- 2021 టోర్నీలో ఆడిన భారత జట్టులో చహల్‌కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తాను సుదీర్ఘకాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు అతడిని వదిలేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ యుజీని కొనుగోలు చేసి అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. ఈ క్రమంలో తన సత్తా ఏమిటో నిరూపించుకున్న ఈ లెగ్ స్పిన్నర్.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో జట్టును రెండోసారి ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 17 ఇన్నింగ్స్‌లో 27 వికెట్లు పడగొట్టి తాజా ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ గెలిచాడు.
ఈ క్రమంలో జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన చహల్ వరుస విజయాల్లో భాగమయ్యాడు. తిరిగి పూర్వ వైభవం పొంది ప్రతిష్టాత్మక ఆసియాకప్-2022 జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఈ మెగా ఈవెంట్‌కు సన్నద్ధమవుతున్న చహల్ వ్యక్తిగత జీవితం గురించి వదంతులు గుప్పుమంటున్నాయి.
సూర్య పార్టీలో అతడితో ఫొటో దిగిన ధనశ్రీ!
చహల్ భార్య ధనశ్రీ వర్మ ఎల్లవేళలా అతడి వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ ఉంటుంది. తమ అనుబంధాన్ని చాటేలా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తుంది కూడా! అయితే, టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల ఇచ్చిన పార్టీకి ధనశ్రీ వెళ్లింది.
అక్కడ సూర్య- దేవిషా శెట్టి దంపతులతో పాటు శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఫొటో దిగింది. ఈ పార్టీలో చహల్ మిస్సయ్యాడు. ఇక ఈ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన సూర్య దంపతులు నిన్ను మేము ఏమాత్రం మిస్సవడం లేదు చహల్.. సారీ అంటూ టీజ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు కొంతమంది చహల్- ధనశ్రీ- శ్రేయస్ అయ్యర్‌ను ఉద్దేశించి విపరీతపు కామెంట్లు చేశారు. చహల్ పని అయిపోయిందని.. ధనశ్రీ శ్రేయస్‌తో చెట్టాపట్టాలేసుకుని చక్కర్లు కొడుతున్న తీరే ఇందుకు నిదర్శనమంటూ అసభ్యకర రీతిలో కామెంట్లు చేశారు.
టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కు మురళీ విజయ్ పట్టించిన గతే చహల్‌కు కూడా పట్టబోతుందంటూ ట్రోల్ చేశారు. కాగా పెళ్లి అయిన తర్వాత తన ఇన్‌స్టా అకౌంట్‌లో ధనశ్రీ వర్మ.. చహల్ ఇంటిపేరును చేర్చుకుంది. అయితే, తాజాగా తన ఇన్‌స్టా బయోలో ఆ పేరు తొలగించిందామె.
దీంతో వదంతులకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలో చహల్- ధనశ్రీ విడాకులు తీసుకోబోతున్నారా? అంటూ గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. ఇందుకు ఓ టీమిండియా క్రికెటరే కారణమంటూ ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో న్యూ లైఫ్ లోడింగ్(కొత్త జీవితం ఆరంభం కాబోతుంది) అంటూ చహల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కోట్ పెట్టాడు. ఇది చూసిన అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. ‘‘అంతా బాగానే ఉందా.. లేదంటే వదంతులే నిజం కాబోతున్నాయా’’ అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, మరికొంత మంది మాత్రం.. ‘‘ వాళ్లు కలిసింది రక్షాబంధన్ రోజు. తప్పుగా అర్థం చేసుకోకండి’’ అంటూ హితవు పలుకుతున్నారు. ఇంకొందరు.. ధనశ్రీ తనకు తానుగా ఎదిగిన వ్యక్తి అని.. ఈ డాన్సింగ్ యూట్యూబర్ భర్త ఇంటి పేరు తొలగించినంత మాత్రాన విపరీతార్థాలు తీయాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరికొందరేమో త్వరలోనే వారి జీవితాల్లోకి బుజ్జాయి రాబోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మురళీ విజయ్‌తో బంధం పెంచుకున్న దినేశ్ కార్తిక్ భార్య.. భర్తకు విడాకులు ఇచ్చి అతడిని పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక ఒకరినొకరు ఇష్టపడ్డ యజువేంద్ర చహల్- ధనశ్రీ వర్మ 2020, డిసెంబరు 22న అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్నారు.
చదవండి: తన స్నేహితుడితో భార్య ‘బంధం’.. భరించలేక నాడు ఆ క్రికెటర్..
Instagram story of Yuzi chahal 👀 pic.twitter.com/HjQSBraLCH
— Mufaddal Vohra (@mufaddol_vohra) August 16, 2022
Surya's story pic.twitter.com/oOa6UJxRCJ
— 𝙨𝙝𝙧𝙚𝙮𝙖 (@jaanekyabaathai) August 13, 2022
Comments
Please login to add a commentAdd a comment