
మొన్న చహల్ అలా.. ఇప్పుడు ధనశ్రీ ఇన్‌స్టా పోస్టుతో ఇలా! నువ్వు నా దానివి! నీకు దిష్టి తగలకూడదు!
Yuzvendra Chahal Wife Dhanashree Verma Post Goes Viral: ‘‘గత 14 రోజులుగా నేను విశ్రాంతి తీసుకుంటున్నా. ఓ రీల్ కోసం డాన్స్ చేస్తున్న సమయంలో మోకాలికి దెబ్బ తగిలింది. అప్పటి నుంచి రెస్ట్. కోలుకునే క్రమంలో గాఢమైన నిద్ర.. కళ్లు తెరిచి చూడగానే ఎంతో ఉపశమనం.. అంతే ఆత్మవిశ్వాసం కూడా! ఈ గాయం కారణంగా ఇంటికే పరిమితమయ్యాను. బెడ్ నుంచి సోఫా.. సోఫా నుంచి బెడ్ మీదకు అంతే!
ఇంత త్వరగా కోలుకునేందుకు నా భర్త, బంధు మిత్రులు, శ్రేయోలాభిలాషులు అందించిన మద్దతుకు ధన్యవాదాలు. సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. నేను మళ్లీ డాన్స్ చేయగలననే అనుకుంటున్నా. కానీ.. ఇలాంటి షాకింగ్ న్యూస్‌ను నేను జీర్ణించుకోలేకపోతున్నా.
నాకు ఎప్పుడైతే విశ్రాంతి అవసరమో అప్పుడే ఇలాంటి న్యూస్‌తో కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టారు. ఇది నిజంగా విద్వేషపూరితమైనది. ఇవన్నీ విని నా మనసు ఎంతగానో గాయపడింది’’ అని టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు షేర్ చేశారు.
కొంతకాలంగా వార్తల్లో చహల్ దంపతులు
కాగా గత కొంతకాలంగా చహల్, ధనశ్రీ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ధనశ్రీ.. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో దిగిన ఫొటో, ఇన్‌స్టా బయో నుంచి చహల్ ఇంటిపేరును తొలగించిన నేపథ్యంలో వీరిద్దరు విడిపోబోతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై స్పందించిన యుజీ.. దయచేసి ఇలాంటి పుకార్లు నమ్మవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు భర్త షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీతో ధనశ్రీ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
సొంతంగా ఎదిగి ఈ స్థాయికి..
అయితే, ఆదివారం తాజాగా మరో సుదీర్ఘ పోస్టుతో ముందుకు వచ్చారు. తాను సొంతంగా ఎదిగి ఈ స్థాయికి వచ్చానన్న ధనశ్రీ.. ఇలాంటి నిరాధార వార్తలు, ఇలాంటి గాయలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే, ఇలాంటి గడ్డు పరిస్థితులు తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయని పేర్కొన్నారు. పబ్లిక్ లైఫ్‌లో ఉన్న కారణంగా ఒక్కోసారి ఇలాంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసనన్న ధనశ్రీ.. తాను మాత్రం వీటిని ఏమాత్రం పట్టించుకోనని తేల్చి చెప్పారు.
నువ్వు నా దానివి!
తద్వారా తన భర్తకు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టతనిచ్చారు. ఇక ధనశ్రీ పోస్టుకు స్పందించిన చహల్.. ‘‘మై వుమన్(నీవు నా దానివి అన్న అర్థంలో)’’ అంటూ హార్ట్ ఎమోజీతో భార్యపై ప్రేమను చాటుకున్నాడు. నీకు ఏ దిష్టి తగలకూడదు అన్నట్లు మరో ఎమోజీని జతచేశాడు. ధనశ్రీ ఇన్‌స్టా పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా డాక్టర్ అయిన ధనశ్రీ వర్మ.. కొరియోగ్రాఫర్‌గా, యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఆమె దగ్గర డాన్స్ నేర్చుకున్న చహల్.. 2020లో ధనశ్రీని వివాహమాడాడు. ఇక కెరీర్ విషయానికొస్తే చహల్ ప్రస్తుతం ఆసియా కప్-2022 టోర్నీకి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు.
చదవండి: Ind Vs Zim: పాపం.. కనీసం ఆఖరి వన్డేలోనైనా వాళ్లిద్దరికీ అవకాశం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లే!
టీమిండియాను విమర్శించిన పాక్ అభిమానులు.. కనేరియా దిమ్మతిరిగే కౌంటర్!