![డ్రిప్ పరికరాలను పరిశీలిస్తున్న ప్రాజెక్ట్ జిల్లా డైరెక్టర్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/1/28kvl53-240072_mr.jpg.webp?itok=VTl2SJAa)
డ్రిప్ పరికరాలను పరిశీలిస్తున్న ప్రాజెక్ట్ జిల్లా డైరెక్టర్
● ఏపీఎంఐపీ జిల్లా డైరెక్టర్ శ్రీనివాసులు
కావలి రూరల్ : ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు, సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎంఐపీ(ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్) జిల్లా డైరెక్టర్ డి.శ్రీనివాసులు తెలిపారు. కావలి రూరల్ మండలంలోని చెన్నాయిపాళెం పంచాయతీలో రైతులకు అందించిన డ్రిప్ పరికరాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు చేయూతనివ్వాలనే ఆశయంతో బిందు తుంపర సేద్యానికి 90 శాతం రాయితీలు ఇస్తోందన్నారు. రైతులు డ్రిప్ పరికరాలను అమర్చుకుని ఉద్యానవన పంటలను సాగు చేసుకుంటూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలన్నారు. అనంతరం రైతులకు డ్రిప్ పరికరాలపై పలు సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ ఇంజినీర్స్ ఎ.బాలజీరెడ్డి, ఫినోలెక్స్ డీసీఓ సీహెచ్.శ్రీనివాసులు, ఫీల్డ్ అసిస్టెంట్ సీహెచ్ వెంకటకృష్ణ, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment