నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌పై ప్రభుత్వం బుధవారం విచారణకు ఆదేశించింది. ఇందుకు సంబంధించి జీఓ ఆర్టీ నంబర్ 52ను విడుదల చేసింది. 1991 నాటి ఏపీ సివిల్ సర్వీసెస్ 20వ నిబంధనలో పేర్కొన్న విధానం ప్రకారం ఈ విచారణ జరుపుతున్నట్టు ప్రభుత్వ కార్యదర్శి పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. వివిధ అంశాలకు సంబంధించి పదిరోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. కలెక్టర్‌గా హరినారాయణన్ ఉన్నప్పుడు సూపరింటెండెంట్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎక్కువగా సెలవులు పెడుతున్నారని, విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, చెప్పిన పనులు చేయడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తర్వాత కాలంలో కలెక్టర్ బదిలీపై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై విచారణ జరగబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై సిద్ధానాయక్‌ను వివరణ కోరగా విచారణకు ఆదేశించినట్టు తనకు తెలియదన్నారు. తాను ఏ పొరపాటు చేయలేదని తెలిపారు. ఇంకా ఉత్తర్వులు తమ కార్యాలయానికి రాలేదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment