కందుకూరు: సీఎం చంద్రబాబు శనివారం కందుకూరులో పర్యటించనున్న నేపథ్యంలో 1060 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. స్థానిక ఎస్‌వీఎస్ కల్యాణ మండపంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది ఎవరికి నిర్ణయించిన ప్రదేశాల్లో వారు హాజరు కావాలన్నారు. అడిషనల్ ఎస్పీ (ఏఆర్) మునిరాజు, ఎస్‌బీ టౌన్, రూరల్, కావలి, ఆత్మకూరు, కందుకూరు ఏఆర్, హెచ్‌జీ డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ ఆర్‌ఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి : సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కందుకూరు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నాగేశ్వరరావు, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, సబ్ కలెక్టర్ టి.శ్రీపూజతో కలిసి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. టీజీపీ స్పెషల్ కలెక్టర్ శీనానాయక్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment